ముగిసిన ఎంసీపీఐయూ ‌కేంద్ర కమిటీ సమావేశాలు

నమస్తే శేరిలింగంపల్లి: భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య (ఎంసీపీఐయూ) జాతీయ మహాసభలను బీహార్ రాష్ట్రం లోని ముజఫర్ పూర్ లో 2022 సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు పార్టీ జాతీయ కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ వెల్లడించారు. ఈ నెల 20 నుంచి 23 వ తేదీ వరకు బాగ్ లింగంపల్లి ఓంకార్ భవన్ బీఎన్ హాల్ లో ఎంసీపీఐయూ పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశాలు కొనసాగాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. కేంద్ర కమిటీ రష్యా, ఉక్రెయిన్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. యుద్దం అనేది మానవ సమాజం మనుగడకు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాపోయారు. చమురు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ అమెరికా తన పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద యుద్ధ కాంక్షను ఉక్రెయిన్ ద్వారా తీర్చుకుంటుందని అన్నారు.

ఎంసీపీఐయూ పొలిట్ ‌బ్యూరో సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ‌ కార్యదర్శి మద్దికాయల అశోక్

దీనికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కాముకులు, వామపక్ష కమ్యూనిస్టులు శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలో ప్రధాని మోదీ, అమిత్ షా లు‌ హిందుత్వాన్ని ఆయుదంగా వాడుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేస్తూ విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు సామాజిక ప్రజా వర్గ పోరాటాలను ఉదృతం చేస్తూ కమ్యూనిస్టుల ఐక్యతకు కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు ప్రకటించారు. సమావేశానికి కామ్రేడ్ కిరణ్ జిత్ సింగ్ శేఖాన్ అధ్యక్షత వహించగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ మహేందర్ నేహా, కామ్రేడ్ కాటం నాగభూషణం, కామ్రేడ్ రాజా దాస్, వి. ఉపేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, అనుభవ్ దాస్ శాస్త్రీ, ఈ. జార్జ్, రాజా దాస్, వి ఉపేందర్ రెడ్డి, చంద్ర మోహన్ ప్రసాద్, జయంత్ గుప్తా, కృష్ణ మాల్, కె బి శర్మ, మంగత్ రాం లాంగో వాల్, సులీప్, యస్ నాగరాజు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వనం సుధాకర్, కుంభం సుకన్య, సింగతి సాంబయ్య, వెంకన్న, మోహన్ లాల్, షాజహాన్, భూపతి నారాయణ్ సింగ్ పాల్గొన్నారు.

ఎంసీపీఐయూ కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయా రాష్ట్రాల 

 

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here