టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి – పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసిన ఉద్యమకారులను పార్టీ ఎన్నటికీ మరవదని, పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ లో హాఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో, ఉద్యమకారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

మాదాపూర్ ‌హఫీజ్ పేట్ డివిజన్ల‌ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్

తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, పరిపాలనలో దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారిందని అన్నారు. యావత్ దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నాడని తెలిపారు. కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హాఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ల అభివృద్ధికి కోట్ల నిధులతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. అసత్య ప్రచారాలు చేసే ప్రతిపక్ష పార్టీల నాయకుల దుశ్చర్యలను తిప్పికొట్టే బాధ్యత మనందరి పైన ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి నేటికీ 21 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలను సూచికగా పండుగలా జరుపుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వార్డు, ఏరియా కమిటీ సభ్యులు, బస్తీ అధ్యక్షులు, మహిళ నాయకులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మాదాపూర్ డివిజన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు, 

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here