నమస్తే శేరిలింగంపల్లి: ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ మసీద్ ఏ ఉమర్-ఫారూఖ్ నందు మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందించే రంజాన్ తోఫాను స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేద ముస్లిం కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. స్వరాష్ట్రంలో పేద ముస్లింలకు సంక్షేమ ఫలాలు సజావుగా అందుతున్నాయని, పేద ముస్లిం విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య నగర్ టిఆర్ఎస్ బస్తి అధ్యక్షుడు మునఫ్ ఖాన్, మైనారిటీ నాయకులు బాబూమియా, సలీం, సదర లియాకత్, మియన్, యూత్ అధ్యక్షులు ఖాజా, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.