గుట్టల బేగంపేట బాధితులకు ఆర్థిక సహాయం అందించాలి – మృతిచెందిన ఇద్దరి కుటుంబాలకు బిజెపి లక్ష రూపాయల అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని గుట్టల బేగంపేట వడ్డెర బస్తీ లో కలుషిత నీరు తాగి మృతిచెందిన ఇద్దరి కుటుంబాలను బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ శాఖ, జిల్లా‌ ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు పరామర్శించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, నరేష్, ప్రభాకర్ యాదవ్ ఇరు కుటుంబాలను పరామర్శించి శేరిలింగంపల్లి అసెంబ్లీ శాఖ తరపున లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ, జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో కలుషిత నీటి సరఫరా అయిందన్నారు. కలుషిత నీటిని తాగి కాలనీకి చెందిన‌ ఇద్దరు వ్యక్తులు మృతిచెందడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలన్నారు. ఈ ఘటనకు కారణమైన అధికారులను సస్పెండ్ ‌చేసి, బస్తీలోని డ్రైనేజీ, నీటి లైన్లను సరిచేయాలన్నారు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు హరికృష్ణ, రాధాకృష్ణ, బుచ్చి రెడ్డి, అనిల్ గౌడ్, నాగేశ్వర్ గౌడ్, మహిపాల్ రెడ్డి, ఆంజనేయులు, వినయ్, మధుయాదవ్, హరిప్రియ, గోవర్ధన్ రెడ్డి, జితేందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నానాయకు

 

కలుషిత నీటిని తాగి మృతిచెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న బిజెపి నాయకులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here