మృతుల‌ కుటుంబాలకు అండగా ఉంటాం- రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ గుట్టల బేగంపేట్ వడ్డెర బస్తీలో ఇటీవల మృతిచెందిన కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హామీనిచ్చారు. గుట్టల బేగంపేట్ లో స్థానిక‌ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పర్యటించారు. బస్తీలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చిన్న బీమయ్య, కన్నమ్మ కుటుంబాలను పరామర్శించి రూ. 5 లక్షల చొప్పున ఇరు కుటుంబాలకు ఎమ్మెల్యే గాంధీ స్వంత డబ్బులను అందజేశారు.

గుట్టల బేగంపేట్ లోని మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

మృతి చెందిన కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, చిన్న బీమయ్య కుమారులు అర్జున్, యశ్వంత్ గురుకుల పాఠశాలలో చదివించేలా చూస్తామని, భార్య గంగమ్మ ఉద్యోగం చేస్తానంటే సరైన ఉద్యోగం వచ్చేలా చూస్తామని అన్నారు. కన్నమ్మ భర్తకు పెన్షన్ ఇప్పించి వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. బస్తీలో నూతన మంజీర పైప్ లైన్ పనులు సైతం పూర్తి చేశామని, ప్రతి ఇంటికి నూతన నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీటిని అందిస్తామని తెలిపారు. అనంతరం బస్తీలో నూతనంగా చేపట్టిన మంజీర పైప్ లైన్ పనులను పరిశీలించారు. ఆయన వెంట టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల‌ శ్రీనివాస్ యాదవ్, బస్తీ నాయకులు సాంబయ్య, యాదగిరి, శ్రీను, వీరేష్,‌ గంగాధర్, పెద్ద బీమయ్య, రంగయ్య, ఈశ్వర్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

గుట్టల బేగంపేట్ లో పర్యటిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here