నమస్తే శేరిలింగంపల్లిః కాలనీల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టీఎన్జీఓ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీకి కాలనీ వాసులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న అన్ని సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తానని చెప్పారు. సీసీ రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు, విద్యుత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో టీఆర్ఎస్ నాయకులు మంత్రి ప్రగడ సత్యనారాయణ, టీఎన్జీఓ కాలనీ వాసులు సుధాకర్, సాయిరెడ్డి, మన్మోహన్, సంజీవయ్య, శ్రీధర్, ప్రేమ్ కుమార్, రామారావు, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.