మ‌హారుద్రాభిషేకంలో ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః ఆధ్యాత్మిక చింత‌న‌తో మాన‌సిక ప్ర‌శాంత‌త అల‌వ‌డుతుంద‌ని ప్ర‌భుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల గ్రామంలోని శ్రీ భవానీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 1331 లీటర్ల ఆవు పాలతో జరిగిన విశేష మహారుద్రాభిషేకం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు, హైద‌ర్ న‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ప్ర‌భుత్వ విప్ గాంధీ పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. స్వామి వారిని ద‌ర్శించుకుని పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , టీఆర్ఎస్ నాయకులు చెన్నం రాజు, సత్యనారాయణ, జనార్దన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వసంత కుమార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here