నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ లో బిజెపి నాయకులు బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జీ యోగానంద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు మాణిక్ రావు, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నాగేశ్వర గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు డి ఎస్ ఆర్ కె ప్రసాద్, రాష్ట్ర నాయకులు మనోహర్ బస్తీ బాట చేపట్టి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీలో డ్రైనేజీ, రోడ్లు, స్మశానవాటిక సమస్యలను వివరించారు. ప్రజల సమస్యలను తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని బిజెపి నాయకులు హామీ ఇచ్చారు. లేనిపక్షంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రవి గౌడ్, రమేష్ సోమిశెట్టి, విజేందర్ సింగ్, ఆకుల లక్ష్మణ్,రామకృష్ణారెడ్డి, రత్నం, శ్రీధర్, శీను, దయాకర్, మన్యం, బాలు, ప్రవీణ్, ఎంఏ నగర్ బస్తీవాసులు పాల్గొన్నారు.