నమస్తే శేరిలింగంపల్లి: కాలనీల్లో నెలకొన్న సమస్యలను ప్రధాన్యత క్రమంలో పరిష్కరించనున్నట్లు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ప్రశాంతి హిల్స్ కాలనీలో ప్రజా సమస్యలపై బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ లో డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల పనితీరుపై తనిఖీ చేశారు. జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి డ్రైనేజీ, సీసీ రోడ్లు, మురికి కాలువల పనులపై చర్చించారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, సీనియర్ నాయకురాలు వరలక్ష్మి, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, ప్రశాంతి హిల్స్ కాలనీ వాసులు అమరేందర్ రెడ్డి, జగదీష్, మధుకర్, ప్రసాద్, రాజు గౌడ్, రమేష్, రవి కిరణ్, శ్రీకాంత్, సురేష్, వెంకట్ రావు, జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఏ కిష్టయ్య, శ్రీనివాస్, కరుణ, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.