నమస్తే శేరిలింగంపల్లి: ఎంసీపీఐయూ పొలిట్ బ్యూరో సభ్యులుగా, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర కుమార్ సంస్మరణ సభను ఈ నెల 6 వ తేదీన నిర్వహించడం జరుగుతుందని మియాపూర్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ కన్న శ్రీనివాస్ తెలిపారు. మియాపూర్ ఎంఏ నగర్ లోని ఎంసీపీఐయూ అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ సంస్మరణ సభ గోడ పత్రికను శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరయ్య కళా నిలయం లో మార్చి 6 న నిర్వహించనున్న తాండ్ర కుమార్ సంస్కరణ సభకు ప్రజలు, ప్రజాతంత్ర వాదులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు. ఎంసీపీఐయూ పోలిట్ బ్యూరో సభ్యులుగా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తూ వామపక్ష కమ్యూనిస్టు, సామాజిక ఉద్యమ శక్తుల ను ఐక్యం చేసేందుకు తాండ్ర కుమార్ ప్రధాన భూమిక పోషించారన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున మియాపూర్ ప్రాంతంలో పొట్ట చేత పట్టుకొని పట్టణానికి వలస వచ్చిన పేద ప్రజలకు అండగా ఉండి వారిని ఐక్యం చేసి కామ్రేడ్ తాండ కుమార్ నాయకత్వంలో 17 బస్తీలను ఏర్పాటు చేశారన్నారు. ఆయన పోరాటాలు, జైలు జీవితం మరువలేనివని, ఆయన మరణం యావత్పీడిత ప్రజా ఉద్యమాలకు ఎనలేని నష్టం కలిగిస్తుందన్నారు. ఆయన ఆశయ సాధనకోసం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మార్చి 6 న నిర్వహించే సంస్మరణ సభకు ఎంసీపీఐయూ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాధ గోని రవి, పోలిట్ బ్యూరో సభ్యులు కిరణ్ జిత్ సింగ్ షేఖాన్, సీపీఎం, సిపిఐ, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శులు, అన్ని సామాజిక వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ గోడపత్రిక ఆవిష్కరణలో గ్రేటర్ కార్యదర్శి తుకారం నాయక్, ఎం రమేష్, పల్లె మురళి ,డివిజన్ కమిటీ సభ్యులు బి నారాయణ, రంగస్వామి, మధు, శంకర్, గణేష్, శరణప్ప, రాణి, లావణ్య, సుల్తానా, లక్ష్మి, మల్లేశ్వరి, ఈశ్వరమ్మ, శివాని, విమల, తదితరులు పాల్గొన్నారు.