ప్రధాని మోదీ వాఖ్యల పట్ల భగ్గుమన్న శేరిలింగంపల్లి టీఆర్ఎస్ శ్రేణులు – మోదీ దిష్టిబొమ్మలు దగ్ధం, నల్ల జెండాలతో నిరసనలు

నమస్తే శేరిలింగంపల్లి: దేవాలయం లాంటి రాజ్యసభ, పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై విషం చిమ్మే మాటలు మాట్లాడడం సరికాదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై బిజెపి తన అక్కసును వెళ్లగక్కిందన్నారు. తెలంగాణ ఆవశ్యకతను అవహేళన చేస్తూ, తెలంగాణ ప్రజల మనోభావాలను కించపర్చడం పట్ల ఆరెకపూడి గాంధీ తీవ్రంగా ఖండించారు. దేశ ప్రధాని హోదాలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి చట్టబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ పోరాటాన్ని మరోసారి అవమానించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి బిజెపి మోసం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని చూసి ఓర్వలేక అవమానకర వ్యాఖ్యలు చేశారని ఎద్దేవా చేశారు.

శేరిలింగంపల్లి డివిజ‌న్ లో..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బిజెపి బాగోతం బహిరంగంగా బట్టబయలైందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి డివిజన్ లో కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్ల తర్వాత ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర ఏర్పాటుపై అనుచిత వాఖ్యలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు కేటాయించిన పాపాన పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ శేరిలింగంపల్లి డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, వార్డు మెంబర్లు శ్రీకళ, పర్వీన్ బేగం, కవిత గోపి, సీనియర్ నాయకులు రామచందర్, గోపాల్ యాదవ్, శ్రీకాంత్, రాజు, రవీందర్, పిల్లి యాదగిరి, రమేష్, నర్సింహ రెడ్డి, నయీం, సాయి, నర్సింహ,సత్యనారాయణ, జమ్మయ్య, రజినీ, సౌజన్య, కల్యాణి, చంద్రకళ, నాజియ, జయ, భాగ్య, కుమారి, గౌసియా, బస్తి కమిటీ అధ్యక్షులు, బస్తి కమిటీ సభ్యులు, మహిళ కార్యకర్తలు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, టీఆర్ఎస్

చందానగర్ డివిజన్ లో…

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ప్రధానమంత్రి మోదీ చేసిన వాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించడం అని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. నరేంద్ర మేదీ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ గాంధీ విగ్రహం వద్ద స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జాతీయ రహదారిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దహనం చేసి బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి ఏడున్నర సంవత్సరాల తరువాత రాష్ట్ర విభజన అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల, విద్యార్థుల బలిదానంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పట్ల నరేంద్ర మోదీ చేసిన వాఖ్యలు సరికాదన్నారు. టీఆర్ఎస్ పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీ మత విద్వేశాలు రెచ్చగొట్టడం, ప్రాంతీయ ప్రాంతాల్లో విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడం కోసం నీచమైన రాజకీయం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మినారాయణ గౌడ్, జనార్దన్ రెడ్డి, ధనలక్ష్మి, పులిపాటి నాగరాజు, పబ్బ మల్లేష్, వెంకటేష్, అక్బర్ ఖాన్, దాస్, అంజాద్ పాషా, యశ్వంత్, ప్రీతమ్, ప్రవీణ్ రెడ్డి, హరీష్ రెడ్డి, ఇమ్రాన్, సికందర్, వరలక్ష్మి రెడ్డి, కుమార్, సందీప్ రెడ్డి, అసఫర్, రామచంద్ర, రమేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో..

తెలంగాణ ఏర్పాటు మీద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్ లో ఇష్టారీతిగా మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోదీ వాఖ్యలను ఖండిస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు హాఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్లలో కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టి, మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పిన బిజెపి మరోసారి మోసం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం మీద విషం కక్కేలా ప్రధాని మోదీ పార్లమెంట్ లో మాట్లాడడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్న టీఆర్ఎస్ ‌నేతలు

మియాపూర్ డివిజన్ లో…
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వాఖ్యలను ఖండిస్తూ మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముప్పవరపు గంగాధర్ రావు, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, అన్వర్ షరీఫ్, గోపారాజు శ్రీనివాస్, పురుషోత్తం యాదవ్, చంద్రిక ప్రసాద్ గౌడ్, రోజా, సుప్రజ, మహేందర్ ముదిరాజ్, జాంగిర్, ఖాజా, మోహిన్, రాజేష్ గౌడ్, శ్రీధర్, దయానంద్, రాజు, నర్సింగరావు, గంగారాం, నర్సింగ్ రావు, ప్రభాకర్, నర్సింహా గౌడ్, సాయి, చరణ్ మింటు, రవి గౌడ్, విజయ్, జంగం మల్లేష్, సంతోష్ ముదిరాజ్, శివ, అనిల్, శివాజీ, శాంతి, చిరు, మహబూబ్, యాదుల్లా, తెనాలి రమేష్, సంతోష్, ప్రసన్న రెడ్డి, కిరణ్ నరేంద్ర, డేవిడ్, రమేష్, అబ్రహం, సుధాకర్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్న టీఆర్ఎస్ ‌నాయకులు

కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో..
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుచిత వాఖ్యలను ఖండిస్తూ గచ్చిబౌలి డివిజన్ లో మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి డప్పులతో నిరసన ర్యాలీగా ఖాజాగూడ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి ఖాజాగూడ ప్రధాన రహదారి వరకు వెళ్లి నిరసన తెలుపుతూ మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ ఏర్పాటు మీద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్ లో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలను గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఖండించారు. ఈ కార్యక్రమంలో రాజు నాయక్ రాగం జంగయ్య యాదవ్, అంజమ్మ, నరేష్ ముదిరాజ్, రాజు ముదిరాజ్, పురుడీ కృష్ణ, రావులకొల్లు గోవింద్, సత్యనారాయణ, రమేష్ గౌడ్, ఎల్ వెంకటేష్ ముదిరాజ్, సుధీర్, అరుణ కుమారి, రాణి, బాలమణి, లక్ష్మి, డివిజన్ సీనియర్ నాయకులు, మహిళ నాయకులు, టిఆర్ఎస్ యూత్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్న దృశ్యం

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here