జయనగర్ లో మారుతి క్లినిక్ ప్రారంభం – హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపి రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మారుతి క్లినిక్ హాస్పిటల్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపి రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీలు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయనగర్ ప్రాంత ప్రజల సౌకర్యార్థం మారుతి క్లినిక్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, రోజాదేవి రంగారావు, మారుతి క్లినిక్ హాస్పిటల్ నిర్వహకులు డాక్టర్ నవీన్, శిరీష సత్తుర్, మాజీ కార్పొరేటర్ రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ ఆధ్యక్షులు సంజీవ, నాయకులు కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, పోశెట్టి గౌడ్, వాసుదేవరావు, మున్నా, యాదగిరి గౌడ్, రాజ్యలక్ష్మి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డిలతో డా.నవీన్, శిరీష
ప్రభుత్వ విప్ గాంధీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ నవీన్, పక్కన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here