నమస్తే శేరిలింగంపల్లి: లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హెల్పింగ్ హాండ్స్ మెంబర్ లయన్ ఎస్.గిరి జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హెల్పింగ్ హాండ్స్ అధ్వర్యంలో అన్న దానం కార్యక్రమం చేశారు. మొవ్వ సత్యనారయణ సహాయంతో మియాపూర్ లోని శ్రీ లక్ష్మి నగర్ సాయిబాబా మందిరంలో 200 మందికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్లబ్ ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హెల్పింగ్ హాండ్స్ ప్రెసిడెంట్ కాట్రగడ్డ శ్యామ్, మొవ్వ సత్యనారాయణ, రాము, గిరి, డి.ఎస్.అర్.కె.ప్రసాద్, సాంబయ్య, వి వి సత్యనారాయణ పాల్గొన్నారు.

