కల్వర్టు పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ చౌరస్తా వద్ద ప్రీతి హాస్పిటల్ పక్కన ఉన్న నాలా పై కోటి 70 లక్షల నిధుల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న కల్వర్టు నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చేస్తున్నామన్నారు. అదేవిధంగా రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యా నాలాపై కల్వర్టు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నాలాలో పేరుకుపోయిన మట్టిని వెంటనే తొలగించాలని, కల్వర్టు నిర్మాణ పనులపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు వి. రాజేశ్వర్ రెడ్డి , నాయినేని చంద్రకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.

కల్వర్టు పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్‌ గాంధీ, రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here