ధనుర్మాసంలో సంక్రాంతి పండగకు విశిష్ట ప్రాధాన్యత: రామస్వామి యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: సంక్రాంతి పర్వదిన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ, సత్యం కళ్యాణి, అర్ బి అర్ కాంప్లెక్స్, దీప్తిశ్రీ నగర్ లలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్ మాట్లాడుతూ రోజురోజుకు అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ధనుర్మాసంలో జరుపుకునే సంక్రాంతి పండగకు ఎంతో విశిష్టత ఉందన్నారు. ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. ఈ పోటీలకు జడ్జీలుగా టి. వరలక్ష్మీ, రజిత వ్యవహరించారు. ప్రతి కాలనీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ఐదు ప్రోత్సాహక బహుమతులను రామస్వామి యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో శివ రామకృష్ణ, విష్ణు ప్రసాద్, రఘునాథ్ రావు, కస్తూరి, వరలక్ష్మి, కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here