నమస్తే శేరిలింగంపల్లి: గ్రామీణ ప్రాంతాలను తలపించేలా మాతృశ్రీ నగర్ కాలనీలో సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం సంతోషకరమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్ కాలనీ లో మాతృ శ్రీనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. సైబరాబాద్ అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బొమ్మతి భవాని, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని సంబరాలను ప్రారంభించారు.
రోజురోజుకు అంతరించిపోతున్న మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. చిన్న నాటి నుంచే పిల్లలకు పండగలు, సంస్కృతి, సంప్రదాయాలను, వాటి విశిష్టతలను తెలియజేయాలని అన్నారు. కాలనీలో రంగ వల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, కోడి పందాలు, బొమ్మల కొలువులు, పాడి పంటలు, పిండి వంటలు తదితర అంశాలపై సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. భోగి మంటలు నిర్వహించారు. ముగ్గుల పోటీలలో గెలిచిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మాతృ శ్రీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనిల్ కావూరి, సెక్రటరీ నాగరాజు, అంజనేయరాజు, భాస్కర్ రెడ్డి, విజయ్,వాసు సతీష్, ప్రసాద్ , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.