నమస్తే శేరిలింగంపల్లి: యువతకు టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి ప్రాధాన్యతను కల్పిస్తుందని, అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలను అందిస్తూ అందరి ఆదరాభిమానాలు కేసీఆర్ ప్రభుత్వం పై ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ రూ.40 లక్షల స్వంత ఖర్చులతో నిర్మించిన హనుమాన్ యూత్ అసోసియేషన్ భవనం, వ్యాయామ శాలను ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, రాగం సుజాత యాదవ్, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. యువకుల కోసం బాపునగర్ లో యువత భవనం, వ్యాయామ శాలను ఏర్పాటు చేసిన రాగం సుజాత నాగేందర్ యాదవ్ ను అభినందించారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని ప్రతి కాలనీ, ప్రతి బస్తీలో మెరుగైన సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. బాపునగర్ ను మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు రాగం అనిరుద్ యాదవ్, వార్డ్ మెంబర్లు, పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, బస్తీ కమిటీ సభ్యులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
