నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పలు అభివృద్ధి పనులు చేపట్టాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక అల కు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వినతి పత్రం అందజేశారు. జోనల్ కార్యాలయంలో జడ్సీని కలిసి మొదటగా పూలమొక్కను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై జడ్సీకి రాగం నాగేందర్ యాదవ్ వివరించారు. రాజీవ్ గృహకల్పలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ పనులు పెండింగ్ లో ఉన్నాయని, గోపీ నగర్ లో నూతనంగా ఒక ఫంక్షన్ హాల్ ను ఏర్పాటు చేయాలని కోరారు. గోపి నగర్, బాపు నగర్, నెహ్రూ నగర్ లలో సీసీ రోడ్లు ఏర్పాటు చేసేలా చూడాలని, త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ కు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.