బిజెవైఎం ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి జాతీయ అధ్యక్షుడిపై, బిజెపి నాయకులపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని బిజెవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ అన్నారు. బిజెపి నాయకులపై కేటీఆర్ చేసిన వాఖ్యలను ఖండిస్తూ మాదాపూర్ డివిజన్ బిజెవైఎం ఆధ్వర్యంలో మియపూర్ ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్ చౌరస్తా లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ మాట్లాడుతూ అహంకార పూరితంగా మాట్లాడిన కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. కేటీఆర్ కు బిజెపి నాయకుల ఔన్నత్యం ఇంకో రెండు జన్మలు ఎత్తినా అర్థం కాదని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను, బిజెపి నాయకులను ఎవరేమి చేయలేరని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన 317 జీఓ ను రద్దు చేసే వరకు బీజేపీ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం డివిజన్ అధ్యక్షులు ఆనంద్ కుమార్, బిజెవైఎం నాయకులు నవీన్ రెడ్డి, నందు, శివ యాదవ్, శ్రీధర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న బిజెవైఎం నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here