వరద నీటి కాలువ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా అవసరాల దృష్ట్యా వరద నీటి కాలువ విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సంబంధిత అధికారులకు సూచించారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో కోటి యాబై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపడుతున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఎమ్మెల్యే గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరద నీటి కాలువ నిర్మాణ పనులకు కొద్దిగా అడ్డంకులు ఉండడంతో ప్రజావసరాల దృష్ట్యా అభివృద్ధి ఆగిపోవొద్దనే ఉద్దేశ్యంతో స్థలం యజమానులతో కార్పొరేటర్, అధికారులతో కలిసి మాట్లాడడం జరిగిందన్నారు. స్థల యజమానులను ఒప్పించి టీడీఆర్ ఇప్పిస్తామని చెప్పి వరద‌ నీటి పనులను ప్రాంభించుకోవడం జరిగిందని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. అసంపూర్తిగా మిగిలిన వరద నీటి కాలువ పనులను పూర్తి చేయడానికి ఇబ్బందులు తొలిగి పోయాయని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనులను పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ రమేష్, ఏఈ సునీల్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, మాజీ కార్పొరేటర్ రంగారావు, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, నాయకులు డాక్టర్ రమేష్, తిరుపతి యాదవ్, రూపా రెడ్డి, మంగమ్మ, గిరి గౌడ్, నరసింహులు గౌడ్, ఆబెద్ అలీ, యాదగిరి, ఎల్లయ్య, నాయుడు, విజయ రాజు, లావణ్య, వెంకట్ రెడ్డి, దీపక్, వసీమ్ తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ డివిజన్ పరిధిలో వరద నీటి కాలువ పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here