నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మాయూరి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మయూరి మహిళా మండలి భవనాన్ని స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తుందని అన్నారు. మయూరి మహిళా మండలి భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇక్కడి మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, మయూరి మహిళా మండలి వ్యవస్థాపకురాలు, చైర్మన్ చంద్రికా ప్రసాద్, జనరల్ సెక్రటరీ స్వాతి, ఉపాధ్యక్షురాలు శ్యామల, సుప్రియ, కోశాధికారి లక్ష్మీరెడ్డి, పుష్పలత, అరుణారెడ్డి, వీణ, సంధ్యారాణి, పద్మ, కాలనీ అధ్యక్షుడు నారాయణరావు, జీఎస్ రామరాజు, వెంకట్రాంరెడ్డి, లావణ్య, అశోక్, తదితరులు పాల్గొన్నారు.