నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ లోని స్మశాన వాటికలో అభివృద్ధి పనులు చేపట్టాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక ఆల కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జోనల్ కార్యాలయంలో జడ్సీని కలిసి వినతి పత్రం అందజేశారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని స్మశాన వాటికలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ఆవశ్యకతను జోనల్ కమిషనర్ ప్రియాంక కు కార్పొరేటర్ హమీద్ పటేల్ వివరించారు. డివిజన్ పరిధిలోని పలు కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.