ప‌ట్ట‌భ‌ద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేయాలి

  • కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి

వివేకానంద‌న‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం ప‌రిధిలోని వివేకానంద నగర్ డివిజన్ లో తెరాస పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌, ప్రభుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ ల ఆదేశాల మేరకు వెంకటేశ్వరనగర్ లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, మాధవరం రామారావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డిలు స్థానిక అసోసియేషన్ పెద్దలతో కలిసి ఓటరు నమోదు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌రు నమోదుపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డిగ్రీ జిరాక్స్ లేదా ప్రొవిజన్ సర్టిఫికెట్ జిరాక్స్‌, ఆధార్ కార్డు, ఓటరు కార్డు/పాన్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్ /కరెంట్ బిల్లు/ ఫోన్ బిల్లు ల‌లో ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్‌తో పాటు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, సెల్ నంబర్, ఈ మెయిల్ తో ఫాం నం 18 నింపి సంతకంతో ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో అధిష్టానం బలపర్చిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మనమందరం పని చేయాలని అన్నారు. డివిజన్ పరిధిలో పట్టభద్రులను గుర్తించి భారీగా ఓటరు నమోదులో పాల్గొనేలా చురుకుగా పని చేయాలన్నారు.

ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను స్వీక‌రిస్తున్న కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి

ఈ కార్యక్రమంలో వార్డ్ కమిటీ సభ్యుడు వెంకటస్వామి సాగర్, డివిజన్ ఆర్గనైజింగ్ జాయింట్‌ సెక్రటరీ హరినాథ్, ఏరియా కమిటీ సబ్యుడు వెంకన్న, స్థానిక నాయకులు జితేందర్, కుమారస్వామి, సోములు, నారాయణ, శ్యాం, శ్రీనివాస్ సాగర్, చిన్నా, ఆర్.యాదగిరి, సత్య‌నారయణ యాదవ్, నాయినేని రామారావు, అశోక్, సోమేష్, నర్సింహులు, రమేష్ చారి, నాగరాజు, రాందేవ్ రెడ్డి, సత్యనారాయణ, సిద్ది రాములు, పూర్ణ, రాజేశ్వర్ రావు, బస్వారెడ్డి, సువిశాల్ రెడ్డి, సంతోష్ రెడ్డి, బస్తీ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here