బసవతారక నగర్ బాధితులకు ఉచిత‌ వైద్య శిబిరం – బిజెపి‌ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి బసవతారక నగర్ లో బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భాగ్యనగర్ డయాగ్నొస్టిక్స్ సౌజన్యంతో ఉచిత‌ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బసవతారక నగర్ లో గత పది రోజులుగా ఎముకలు కొరికె చలిలో పసి పిల్లలు , గర్భిణి స్త్రీలు, వృద్ధులు ఉంటున్న నేపథ్యంలో వారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎవరూ అధైర్య‌పడకుండా‌ ధైర్యంగా ఉండాలని, న్యాయస్థానం లో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నా లేని‌ కిందకే జమ చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. బాధితులను ఏ ఒక్క రోజూ పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మెల్యే ఉండి కూడా లేనట్టే అని మండిపడ్డారు. దౌర్జన్యంగా పేదల ఇళ్లు కూల్చివేసి రోడ్డున పడేసిన ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు‌ తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో రాపిడ్ క్లీనిక్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, బిజెవైఎం చేవెళ్ల జోనల్ కో కన్వీనర్ తోట్ల భరత్ కుమార్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు బాల, సీతారాం, హరీష్ శంకర్ యాదవ్, కిషన్ గౌలి, నర్సింగ్ నాయక్, శ్రీను, రాజు, గుండప్ప రమేష్, రంగయ్య, బాబు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

బసవతారక నగర్ లో‌ ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన బిజెపి‌ నాయకులు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here