నమస్తే శేరిలింగంపల్లి: బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయితగా, సాంస్కృతిక వారిధి గా, బహుబాషా కోవిదుడిగా పేరుగాంచిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు అని తెలంగాణ బ్రాహ్మాణ సేవా సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పండ్ర ప్రగడ లక్ష్మణ్ రావు పేర్కొన్నారు. అపర చాణక్యుడు, మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావు 17 వర్ధంతిని పురస్కరించుకొని బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి లో ఏర్పాటు చేశారు. పీవీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పీవీ నరసింహారావు జయంతి, వర్ధంతి వేడుకలను తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు పోచంపల్లి రమణా రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లోని ఏదేని ఒక జిల్లాకు పి వి నరసింహారావు పేరు పెట్టాలని గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో విన్నవించినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఏదేని ఒక జిల్లాకు పివి నరసింహారావు పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.