నమస్తే శేరిలింగంపల్లి: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతుల సహాయార్థం ప్రధాన మంత్రి సహాయ నిధికి మదీనగూడ మైత్రి నగర్ త్రివేణి ఎడ్యుకేషనల్ విద్యార్థులు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షా నూట పదహారు రూపాయల విరాళాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కి అందజేశారు. త్రివేణి డైరెక్టర్ డా వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23 న దేశవ్యాప్తంగా భారతదేశ 5వ ప్రధానమంత్రి, భారతదేశపు రైతుల విజేతగా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. తమ విద్యాసంస్థలో విద్యనభ్యసించే చిన్నారులు రైతులకోసం విరాళాలు సేకరించి గవర్నర్ కు అందజేయడం జరిగిందన్నారు. రైతు చేతులు భూమి లోకి వెళ్తేనే, మన వేళ్ళు నోటిలోకి వెళతాయని, రైతును కాపాడుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులను, ప్రోత్సహించిన త్రివేణి స్కూల్స్ డైరెక్టర్ డా. వీరేంద్ర చౌదరి ని, మార్గం చూపిన ఉపాధ్యాయ బృందాన్ని, విరాళాలను అందచేసిన విద్యార్థులను గవర్నర్ తమిళ సై సత్కరించారు. విద్యార్థులకు పుస్తకాలు బహుకరించారు అభినందించారు.