ఈ – శ్రమ్ కార్డుతో అసంఘటితరంగ కార్మికులకు చేయూత – అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినీల

నమస్తే శేరిలింగంపల్లి: అసంఘటిత కార్మికులకు, దినసరి పనులు చేసేవారికి ఈ- శ్రమ్ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతాయని శేరిలింగంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినీల అన్నారు. ఇజ్జత్ నగర్ లో శుక్రవారం అసంఘటిత కార్మికులకు ఈ- శ్రమ్ కార్డుల నమోదు కార్యక్రమాన్ని ఏఎల్ఓ వినీల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు, దినసరి పనివాళ్లకు పనిచేసే ప్రదేశంలో ఎలాంటి ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి శారీరక ఇబ్బంది కలిగిన, మరణం సంభవించిన వారికి భారత ప్రభుత్వం తరఫున ఆర్థిక నష్టపరిహారం అందుతుందన్నారు. లింగంపల్లి ప్రాంతంలో ప్రధానంగా మురికివాడల్లోని పేద ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా స్టాలిన్ నగర్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అందరికీ కార్డులను జారీ చేసేలా చూస్తామని చెప్పారు. అసంఘటిత రంగ కార్మికులు, దినసరి పనివాళ్లు ఈ శ్రమ్ కార్డు కోసం పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కె. చందు యాదవ్, ఇజ్జత్ నగర్ శాఖ కార్యదర్శి కాసిం, డి. రవి, ఎస్. నారాయణ, పర్వతాలు, నర్సమ్మ, సి భాస్కర్, ఎం. అశోక్, ఎం. వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here