నమస్తే శేరిలింగంపల్లి: స్వచ్ఛ్ సర్వేక్షణ్-22 కార్యక్రమంలో మదర్ సేవా సమితి సోషల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండల్ రెడ్డి ని శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయం శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జలందర్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ్ సర్వేక్షన్ లో భాగంగా మదర్ సేవా సమితి చేసిన సేవలను గుర్తించి ఉత్తమ ఎన్జీఓగా ప్రకటించి సన్మానించుకోవడం జరిగిందన్నారు. మదర్ సేవా సమితి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితంగా ప్లాస్టిక్ రహిత సంచులను, నోట్ బుక్స్, పెన్నులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. హరితహారం తో పాటు మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారని చెప్పారు. మదర్ సేవా సమితి అధ్యక్షుడు బద్దం కొండల్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవలో తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందన్నారు. భవిష్యత్తు లో మరిన్ని సామాజిక సేవలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం శానిటేషన్ ఎస్ఆర్ పీ సిబ్బంది బద్దం కొండల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.