నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రజాశల్టర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులు చేపట్టాలని కాలనీ అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాలనీ అసోసియేషన్ సభ్యులు స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కాలనీలో పెండింగ్ పనులు, అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజాశల్టర్ కాలనీలో ఏ సమస్య ఉన్న దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజశల్టర్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్, కిరణ్, హర్ష, సాంబశివరావు, శంకర్, భరత్ తదితరులు పాల్గొన్నారు.