నమస్తే శేరిలింగంపల్లి: నేరాలను అదుపు చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చందానగర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ క్యాస్ట్రో రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కాలనీ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ మేరకు కాలనీ అధ్యక్షుడు డి. వెంకటేశం, కాలనీ అసోసియేషన్ సభ్యులు రూ. 1.40 లక్షల చెక్కును చందానగర్ సీఐ క్యాస్ట్రో రెడ్డికి అందజేశారు. ఫ్రెండ్స్ కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన కాలనీ అసోసియేషన్ సభ్యులను, కాలనీ వాసులను సీఐ క్యాస్ట్రో రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమం లో ఎస్ఐ శ్రీధర్, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.