నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రం లో ముదిరాజ్ లు విద్యాపరంగా, రాజకీయ పరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆల్ ఇండియా కోహ్లీ సమాజ్ ప్రధాన కార్యదర్శి ఉమేష్ కుమార్ పేర్కొన్నారు. మియాపూర్ సమీపంలో ముదిరాజ్ కోహ్లీ బహిరంగ సభను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మాట్లాడుతూ ముదిరాజ్ లు ఎదుర్కొంటున్న సమస్యలపై కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. 60 లక్షలకు పైగా జనాభా ఉన్న ముదిరాజ్ లు రాజకీయంగా, విద్యాపరంగా అభివృద్ధి సాధించకపోవడం బాధాకరమని అన్నారు. సామాజికపరంగా ప్రోత్సాహం లేకపోవడం వలనే కోహ్లీ సమాజాన్ని ఎంచుకున్నామని చెప్పారు. సమాజంలో ఉన్న ముదిరాజ్ లు ఎంతగానో అభివృద్ధి చెందారని, రాజకీయపరంగా ఎమ్మెల్యే, క్యాబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులయ్యారని అన్నారు. పార్లమెంటులో ముదిరాజ్ లకు సరైన హోదా దొరకడం వల్ల తెలంగాణలో ముదిరాజ్ కమిటీని కోహ్లీ సమాజంలో చేర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో విద్యాపరంగా, రాజకీయపరంగా అన్ని సమకూరుతాయని చెప్పారు. కార్యక్రమంలో కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్, ఎస్ నాగయ్య ముదిరాజ్, ప్రభాకర్ ముదిరాజ, ఎం సురేష్ ముదిరాజ్, ఎస్ సురేష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.