ధర్మపురి క్షేత్రంలో‌ ఘనంగా శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్టాపన

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో బుధవారం విజయ దుర్గాదేవి ఆలయంలో శ్రీ కృష్ణుని విగ్రహ ప్రతిష్టాపన వేదమంత్రోచ్చరణల మధ్య ఆగమ నియమాలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఇస్కాన్ టెంపుల్ ప్రభూజి ప్రమోద్ ప్రభుదాసు మాట్లాడుతూ మాసానాం మార్గశీర్షోహం అనబడే మార్గశీర్ష మాసంలో తన వైభవాన్ని ప్రకటించుకుంటూ తన సోదరి ఆహ్వానాన్ని మన్నించి దుర్గాదేవి క్షేత్రంలోకి వచ్చి ధర్మసంస్థాపనలో దుర్గాదేవి చేస్తునటువంటి కార్యక్రమానికి తాను వెన్నుదన్నుగా నిలబడతానంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు కొలువుదీరాడన్నారు. శ్రీ కృష్ణ పరమాత్ముడు కొలువు దీరడం ధర్మకార్యంగా ఇక్కడి భక్తులు భావిస్తున్నారని పేర్కొన్నారు. అమ్మ వారి అనుగ్రహం అంటే విజయ దుర్గా దేవి అనుగ్రహం, జగద్గురువు అయిన శ్రీ కృష్ణ పరమాత్మని అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, ప్రార్థనలు చేశారు. కోలాట బృందం అంతా గోపిక లై కోలాటాలతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో అట్లూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిష్టింపబడిన శ్రీ కృష్ణుని విగ్రహం
హోమం నిర్వహిస్తున్న భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here