నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తున్నామని మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని నవభారత్ నగర్ లో ఆదివారం స్థానికులతో కలిసి పాదయాత్ర చేశారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు, డ్రైనేజీ తదితర సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు.ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అనంతరం నూతనంగా మంజూరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నూతనంగా చేపట్టాల్సిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ పరిశీలించారు. బస్తీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ కమిటీ సభ్యులు కార్పొరేటర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షులు మొహమ్మద్ సాదిక్, సయ్యద్ నురుద్దిన్, షేక్ అలీ, మొహమ్మద్ అంజద్ ఖాన్, కత్తల్ అహ్మద్, ఎండి ఆఫ్రోజ్, ఎండి సిరజ్, కరణ్, గిరీష్ రెడ్డి, ఎండి ఆఫీజ్, ఎండి అమీర్, ఎండి తమిమ, ఎండి గౌస్, ఎండి తాజ్, అంజద్, చిన్న, మోహన్, మహిళలు సహిన్ తాజ్, సావిత్రి, రెహానా, రాములమ్మ, కమలమ్మ, గౌసియ బేగం తదితరులు పాల్గొన్నారు.