ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ‌ఆధ్వర్యంలో ఉచిత‌ వైద్య శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: ఫ్ర్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిటిజన్ హాస్పిటల్ వారి సౌజన్యంతో గచ్చిబౌలి డివిజన్ డాక్టర్స్ కాలనీలో ఆదివారం ఉచిత‌ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో‌ నిర్వహించిన ఈ శిబిరంలో ఎత్తు, బరువు, బీపీ, షుగర్, ఈసీజీ, దంత, చర్మవ్యాదుల పరీక్షలను నిర్వహించారు. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ తహ జబీన్, చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ కుమార్, దంత వైద్యులు డాక్టర్ నవీన్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాంత్రిక జీవితం గడుపుతున్న నేటి తరుణంలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల అనేక రుగ్మతలకు గురవుతున్నారని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే నిత్యం వ్యాయామం, నడక, ధ్యానం చేయాలని అన్నారు. రోజు కనీసం 40 నిమిషాలు వ్యాయామం చేయాలని, తాజా ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పి బుచ్చి రెడ్డి, రాజ్ కుమార్, రాజు, యంగయ్య, రీటా, సతీశ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, శివరామకృష్ణ, హాస్పటల్ ప్రతినిధి జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here