శ్రీకాంతాచారికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: మలిదశ తెలంగాణ ఉద్యమం లో తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతా చారి చేసిన ప్రాణత్యాగాన్ని యావత్తు తెలంగాణ ప్రజానీకం మరవలేనిదని శేరిలింగంపల్లి డివిజన్ ‌కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో శ్రీకాంతా చారి వర్థంతి ని నిర్వహించారు. శ్రీకాంతా చారి చిత్రపటానికి పూలమాల వేసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఘన‌ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాన్ని తృణప్రాయంగా తెలంగాణ రాష్ట్రం కోసం‌ అర్పించి ఢిల్లీ పెద్దలకు తెలంగాణ ఆవశ్యకత అర్థమయ్యేలా శ్రీకాంతా చారి చేశారన్నారు. శ్రీకాంతా చారి ప్రాణ త్యాగంతో ఉద్యమం మరింత ఉధృతమైందన్నారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీకాంతా చారి చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here