నమస్తే శేరిలింగంపల్లి: ఉద్యమకారులకు కనీస గుర్తింపు లేదనే ఆవేదనతో శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని ఉద్యమకారులను ఏకం చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం చందానగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న ధరమ్ వీర్ ను ఉద్యమకారులు కలిశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు లేకపోవడం బాధాకరమని ఆవేదన చెందారు. ధరమ్ వీర్ ను కలిసిన వారిలో గంగారం సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, షేక్ జామిర్, మిద్దెల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.