జేపీ నడ్డా జన్మదినం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో భారతీయ‌‌ జనతా పార్టీ దినదినాభివృద్ధి చెందడంతో పాటు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పూర్తి స్థాయి అధికారంలోకి రానున్నట్లు బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. జేపీ నడ్డా 61 వ జన్మదినం సందర్బంగా కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీలకు, రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీకి, ప్రజలకు ఎన్నో రకాల సేవలందించారని అన్నారు. తెలంగాణలో జేపీ నడ్డా విశిష్ట సేవలు అవసరం ఉన్నాయని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ జేపీ నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ వరదాచారి, పార్టీ నాయకులు ఎల్లేశ్, రాధాకృష్ణ యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, ఆంజనేయులు సాగర్, క్రాంతి, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, గణేష్, శ్రీను, రాము, సాయి, వినోద్ యాదవ్, మల్లేశ్, గోపాలకృష్ణ, రాజు, పద్మ, రేణుక, మల్లిక తదితరులు పాల్గొన్నారు.

జేపీ నడ్డా జన్మదినోత్సవం పురస్కరించుకుని రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here