నమస్తే శేరిలింగంపల్లి: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన కల్వకుంట్ల కవితను రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన కల్వకుంట్ల కవితను నిజామాబాద్ లోని ఆమె స్వగృహంలో రాగం సుజాతనాగేందర్ యాదవ్ దంపతులు కలిశారు. మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్ దాఖలు చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.