నమస్తే శేరిలింగంపల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది. మియాపూర్ పోలీసుల కథనం ప్రకారం నరాకుల నాగరాజు (26) ఓల్డ్ హఫీజ్ పేట్ ప్లాట్ నంబర్ 2-53, 4వ అంతస్తు, ఫ్లాట్ నంబర్ 403 లో నివాసం ఉంటున్నాడు. సిరివనం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌లో అకౌంటెంట్‌గా ఉద్యోగిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. సిరివనం కంపెనీ ఎండీ నాగం కిరణ్ కుమార్ నాగరాజు సోదరుడు నరాకుల కార్తీక్ కు ఫోన్ చేసి నాగరాజు ఉద్యోగానికి రాలేదని సమాచారం ఇచ్చాడు. నాగరాజు నివాసం ఉంటున్న గదికి వెళ్లి చూడగా అక్కడే తన మొబైల్ విడిచి పెట్టి వెళ్లడంతో పాటు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఉన్న లేఖను గుర్తించారు. అపార్ట్ మెంట్ సీసీ ఫుటేజీని పరిశీలించగా ఈ నెల 12 న ఉదయం 11 గంటలకు గది నుంచి బ్యాగుతో వెళ్లిపోయినట్లు గుర్తించారు. కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు మియాపూర్ సెల్ నెం 9701250058 ను సంప్రదించాలన్నారు.