నమస్తే శేరిలింగంపల్లి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందజేయడం సంతోషకరమని తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి పేర్కొన్నారు. సరోజనమ్మ అనారోగ్యానికి గురై ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేసుకున్న డబ్బులను ఎమ్మెల్సీ కవిత సహాయంతో సీఎంఆర్ఎఫ్ మంజూరైంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.38 వేల చెక్కును తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎల్ రూప్ సింగ్, తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కు ను అందజేసి ఆర్థికంగా ఆదుకున్నందుకు సరోజనమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.