నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడలో డివిజన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గచ్చిబౌలి డివిజన్ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. భారత్ మాత చిత్రపటానికి డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్ తో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యవర్గం ముఖ్య ఉద్దేశం డివిజన్ లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. డివిజన్ లోని నాయకులు, కార్యకర్తల సూచనలు, సలహాలు స్వీకరించి బిజెపి బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీ పటిష్టత కోసం బూత్ ఇన్ చార్జీలు, శక్తి కేంద్ర ఇన్ చార్జీలు కలిసి సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని డివిజన్ కార్యవర్గ సమావేశం తీర్మానం చేసింది. అనంతరం నవంబర్ 16న చలో ట్యాంక్ బండ్, నిరుద్యోగ మిలియన్ మార్చ్ లో డివిజన్ స్థాయి కమిటీ సభ్యులు, మోర్చా నాయకులు, బూత్ సభ్యులు, డివిజన్ లోని జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు మీన్ లాల్ సింగ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ నరేందర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా కోశాధికారి రమేష్ సోమిశెట్టి, సంతోష్ సింగ్, కార్యదర్శి గోపాల్, డివిజన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంలేట్ విజయ్ రాజు, సంజీవ, గచ్చిబౌలి డివిజన్ జనరల్ సెక్రటరీ సురేంద్ర ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ కోశాధికారి సతీష్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ కార్యదర్శి సురేందర్ కుమార్, గచ్చిబౌలి డివిజన్, వైస్ ప్రెసిడెంట్ అంబటి అశోక్ కుమార్, శంలేట్ నందు, తిరుపతి, దయాకర్, గచ్చిబౌలి డివిజన్ ఐటీ సెల్ కన్వీనర్ రాఘవేంద్ర, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, గచ్చిబౌలి డివిజన్ బిజెవైఎం అధ్యక్షుడు నక్క శివ కుమార్, బిజెవైఎం జనరల్ సెక్రటరీ సామ్రాట్ , బిజెవైఎం వైస్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర ముదిరాజ్, బిజెవైఎం ఉపాధ్యక్షులు శివ గౌడ్, మున్నూరు సాయి, సీనియర్ నాయకులు స్వామి గౌడ్, మీన్ లాల్ సింగ్, నరసింహ రాజు, శంలేట్ రాజు, శివ సింగ్, రంగస్వామి, శ్రీనివాస్, దుర్గరామ్, విజయ్ కుమార్, సాయి కుమార్, బాబులు సింగ్, మాధవ రెడ్డి, సతీష్ గౌడ్,రామకృష్ణ, సతీష్, శ్రీకాంత్ రెడ్డి, శంకర్, గుండప్ప, అరుణ్, కిషన్ గౌలి, మహేష్, యాదయ్య, అరవింద్ సింగ్, సంకేష్ సింగ్, దుర్గరామ్, సోనుదేవ్ సింగ్, అంబటి రామకృష్ణ, సంతోష్ సింగ్, రవి కుమార్, గుండప్పా, రాజు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.