శాసనమండలిలో మున్నూరుకాపులకు స్థానం కల్పించాలి: రాష్ట్ర మున్నూరు కాపు సంఘం

నమస్తే శేరిలింగంపల్లి: మున్నూరు కాపులకు తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ విజ్ఞప్తి చేశారు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ నగరంలో జరిగింది. తెలంగాణ శాసన మండలిలో మున్నూరుకాపులకు ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. శాసన మండలి ఎన్నికల్లో మున్నూరు కాపులకు సరైన ప్రాతినిథ్యం కల్పించాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

మున్నూరుకాపు రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం

ఈ సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సుంకరి బాలకిషన్ రావు పటేల్, కౌన్సిల్ సభ్యులు వీరమళ్ళ ప్రకాశ్ పటేల్, వద్దిరాజు రవిచంద్ర పటేల్, సి.విఠల్ పటేల్, రౌతు కనకయ్య పటేల్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండా దేవయ్య పటేల్, చల్లా హరిశంకర్ పటేల్, గాలి అనిల్ కుమార్ పటేల్, బుక్క వేణుగోపాల్ పటేల్, మంగళరాపు లక్ష్మణ్ పటేల్, వైద్యం వెంకటేశ్వర్లు పటేల్, కల్లూరి హనుమంత్ రావు పటేల్, విష్ణు జగతి పటేల్, లవంగాల అనిల్ పటేల్, ఇసంపల్లి వెంకన్న పటేల్, అల్లాడి గీతా రాణి పటేల్, తూము మనోజ్ పటేల్, బూర్గు భావి హనుమంత్ రావు పటేల్, సామల వేణు పటేల్, తూడి ప్రవీణ్ పటేల్, తూము రాజ్ కుమార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here