నమస్తే శేరిలింగంపల్లి: విశాఖ శ్రీ శారదా పీఠపాలిత చందానగర్ శిల్పా ఎన్క్లేవ్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, అన్నపూర్ణ ఎన్క్లేవ్ శ్రీ షిరిడి సాయి దేవాలయాల ఆద్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆలయల వ్యవస్థాపక చైర్మన్ యూవీ రమణ మూర్తి, కమిటి సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుదవారం నుంచి ఈనెల 19వ తేది వరకు శిల్పఎన్‌క్లేవ్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ప్రాంగణంలో జరిగే ఈ దీపోత్సవాలలో భాగంగా ప్రతిరోజు సాయంత్ర 7 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

బుదవారం స్థానిక భక్తులు లక్ష్మీనారాయణ దంపుతులచే శ్రీ సిద్ధి, బుద్ధి సమేత గణపతి కళ్యాణం, గురువారం అన్నపూర్ణ సాయిబాబా దేవాలయం ఆద్వర్యంలో సాయిపల్లకి, దూప్హారతీ సేవ, శుక్రవారం ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావుచే శివస్తుతి ప్రవచనం, శనివారం చలసాని జయకృష్ణ, నాగలిఖిత దంపతులచే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఆదివారం బ్రహ్మశ్రీ నోరి నారాయణ మూర్తిచే శివపార్వతుల కళ్యాణంపై ప్రవచనం, సోమవారం వీరభద్రరావు, హరిణి దంపుతలచే శివకళ్యాణం, మంగళవారం రాజ్‌కుమార్, మధుమతి దంపతులచే వల్లీదేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, బుధవారం బి.శ్రీనివాస్ జ్ఞానప్రసన్న, వెంకట సుబ్బారావు, భారతి దంపతులచే శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి కళ్యాణం, గురువారం జ్వాలాతోరణం, తిలక్ రమ్య, శ్రీనివాస్ వసుందర దంపతులచే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగ నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రధానార్చకులు పవనకుమార శర్మ, మురళీధర శర్మ బృందంల పర్యవేక్షణలో జరుగనున్న ఈ ఉత్సవాలలో శుభమ్ జ్యువేలరీ శ్రీనివాస్ శ్యామల దంపతులు, శ్రీరామ డిస్ట్రీబ్యూటర్స్ రమేష్ ఉమారాణి దంపతులు ఉత్సవాల ప్రధాన దాతలుగా, రాజు చందన దంపతులు పుష్పాలంకరణ సేవ, శేషగిరిరావు, శ్రీదేవి దంపతులు ప్రసాద సేవలో భాగస్వాములు అవనున్నట్టు తెలిపారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
