నమస్తే శేరిలింగంపల్లి: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్ క్లేవ్ కాలనీ, గంగారం గ్రామంలోస్థానిక యువనేత పి.ఉదయ్ ఆద్వర్యంలో సదర్ సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. సదర్ సమ్మేళనం ప్రాముఖ్యతను ఆరెకపూడి గాంధీ వివరించారు. యాదవ సోదరులకు మూగజీవాలతో ఉన్న అవినాభావ సంబంధం ఈ సదర్ సమ్మేళనంలో సుస్పష్టం అవుతుందని అన్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపే పశు సంపదతో కలసి జరుపుకునే ప్రపంచంలోనే అరుదైన పండుగ సదర్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు ధనలక్ష్మి, రవీందర్ రెడ్డి, దొంతి శేఖర్, కంది జ్ఞానేశ్వర్, హనీఫ్, యాదయ్య, రాజు, రాహుల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.