నమస్తే శేరిలింగంపల్లి: సామాజిక సేవలో భాగంగా తమకు తోచిన విధంగా సహాయం చేయడం ఆనందంగా ఉందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320 డి మొదటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జి. శ్రీనివాస్ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల వేతనం కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రాణహిత రూ.10 వేల నగదును శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ప్రతి నెలా ఉర్థూ మీడియం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నెల వేతనం లయన్స్ క్లబ్ అందజేయడం జరుగుతుందన్నారు. రూ. 10 వేల విరాళం ఇచ్చిన లయన్ ఎండీ అన్వర్ షరీఫ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లయన్ ప్రతాప్ రెడ్డి, లయన్ కృష్ణయ్య, లయన్ రాజు తదితరులు పాల్గొన్నారు.