బండి సంజయ్ రైతు దీక్షకు కసిరెడ్డి భాస్కర రెడ్డి మద్దతు

నమస్తే శేరిలింగంపల్లి: వరి – ఉరి ప్రభుత్వ వైఖరిపై బిజెపి కార్యాలయంలో చేపట్టిన రాష్ట్ర రైతు దీక్షలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టాలు తీర్చేందుకు, వరి సాగు కోసమే ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకని ప్రశ్నించారు. వరి పంట సాగు చేయొద్దని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షల కోట్లు వెచ్చించి కాళేశ్వరం నిర్మాణానికి ప్రయోజనమని ఏంటన్నారు. వరిధాన్యం చివరి విత్తనం వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. లేని పక్షంలో రైతుల పక్షాన బిజెపి పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి, కిసాన్ మోర్చా, మహిళా మోర్చా, యువమోర్చ, ఓబీసీ మోర్చా నాయకులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరి త్రినాథ్ గౌడ్, యువమోర్చా నాయకుడు నీరటి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి రైతు దీక్షలో బండి సంజయ్ కు‌ మద్దతు తెలుపుతున్న కసిరెడ్డి భాస్కర రెడ్డి
Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here