నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మంజీరరోడ్డులో నిర్వాహకులు నందకుమార్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుర్ విజయం ఆయుర్వేద హాస్పిటల్ ను మంగళవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ పరిసర ప్రాంత ప్రజలకు అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆయుర్వేదిక్ హాస్పిటల్ ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. కేరళ వైద్యాన్ని అందించేందుకు సేవ దృక్పథంతో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు డాక్టర్లు దేవుడితో సమానం అని పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని సామాజిక సేవ రూపంలో సరసమైన ధరలతో మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, హఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, బాల కృష్ణ , దాస్ తదితరులు పాల్గొన్నారు.