నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం కాలనీలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. ముగింపు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కాలనీలోని పురవీధుల్లో ఊరేగించారు. ఐతే ఊరేగింపు ప్రారంభంలో ఓ గోమాత వచ్చి ఉత్సవ మండపంలో గోమయం, పంచకం సమర్పించింది. దీంతో అనుకోకుండా గోమాత వచ్చి తమను ఆశీర్వదించిందంటూ నిర్వాహకులు, స్థానిక భక్తులు పులకించిపోయారు.