నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ మండలి చైర్పర్సన్ రాగం సుజాత నాగేందర్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాన్స్ ఇన్ ఫ్రా ఆధ్వర్యంలో నెస్ట్ వృద్ధాశ్రమం లోని వృద్ధులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చేతుల మీదుగా దుస్తులను అందజేశారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అడిగి తెలుసుకున్నారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు కల్పిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశంగౌడ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, సందయ్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ బస్వరాజ్, వెంకటేశ్వర్లు, చంద్రకళ, సుధారాణి, సబినాకుమారి, రోజా, కుమారి, రాజు, యోగి, రాగం అభిమానులు పాల్గొన్నారు.