నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బీజేవైఎం తరపున కృషి చేస్తామని రాష్ట్ర బీజేవైఎం కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రఘునాథ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు కులవృత్తులు అంతరించుకుపోతున్నాయని, కులవృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శుభకార్యమైనా, అశుభకార్యమైనా రజకుల పాత్ర కీలకంగా ఉండేదన్నారు. అనివార్యంగా మారిన రజకులకు అండగా ఉంటామని రఘునాథ్ యాదవ్ అన్నారు. ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.